మంగళవారం నాడు బీబీ నగర్ లోని రాయల్ సీడ్స్ విత్తన కంపెనీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి కంపెనీలో జరుగుతున్నటువంటి పత్తి విత్తనాల ప్యాకింగ్ యూనిట్ ను, విత్తనశుద్ధి కార్యక్రమాన్ని సరైన పద్ధతిలో నిర్వహిస్తున్నరా లేదా అని పరిశీలించడం జరిగినది. అలాగే పత్తి విత్తనాలు పండించిన growers లిస్టు పరిశీలించారు. పండించిన విత్తన పత్తి ఎన్ని కిలోల విత్తనాలు వచ్చినవి రైతు పండించిన ప్యాకింగ్ చేయునప్పుడు విత్తనాలు అని చెక్ చేయడం జరిగింది. 450 గ్రాముల bt విత్తనాలకు 25 గ్రాములు నొన్ bt విత్తనాలు కలుపాలని తెలియజేసినారు్ విత్తన పాకెట్లపై డేట్ ఆఫ్ టెస్టింగ్ తర్వాత లాట్ నెంబర్ ఎం ఆర్ పి రేట్ మొదలైనవి కరెక్టుగా ప్రింట్ చేయాలని తెలిపారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. రికార్డులు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. అనాలసిస్ టెస్ట్ రిజిస్టర్, సీడ్ ప్రాసెసింగ్ రిజిస్టర్ మొదలగునవి కరెక్ట్ గా మెయింటెన్ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి smt.అనురాధ, సహాయ వ్యవసాయ సంచాలకులు దేవ సింగ్, మండల వ్యవసాయ అధికారి పద్మ ఉన్నారు.