Press note. 11.1.2022. గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనులు, పల్లె ప్రగతి పనులు, తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, కమిషనర్ డా.శరత్ లతో కలిసి ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు, డి.ఆర్.డి.ఓ.లు, డి.పి.ఓ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా మూడవ దశ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్యం అంశంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, అవసరమైన మేర హైడ్రోక్లోరిక్ స్ప్రే చేయాలని, ప్రణాళికాబద్ధంగా పారిశుద్యం పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. 15-18 పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని అధికారులకు మంత్రి సూచించారు. మెడికల్ సిబ్బంది, 60 ఏళ్ళ పైబడిన వారికి బూస్టర్ డోస్ అందజేయాలని మంత్రి తెలిపారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు అధికంగా నిర్వహించాలని, గ్రామాల్లో అధిక మొత్తంలో ప్రజలకు ఉపాధి కల్పించాలని, చెరువుల పూడిక తీతలు, కాలువ మరమ్మతు పనులు పిచ్చి మొక్కలు తొలగింపు పనులు, గ్రామ అభివృద్ధి పనులలో అధిక పనులు చేపట్టి వీలైనంత మేర ఉపాధిహామీ నిధులను వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో పిచ్చిమొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని, కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో నిర్మించిన స్మశానవాటికలు, డంపింగ్ యార్డులను వినియోగించాలని మంత్రి తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ వైకుంఠదామం ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనరులు మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే మెగా పల్లె ప్రకృతి వనాల పెంపకంపై మంత్రి చర్చించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో నూతన జాబ్ కార్డులు అందజేయాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా జాబ్ కార్డు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

Share This Post