Press Note. 12-05-2022 ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి వైద్య అధికారులకు సూచించారు.

గురువారం నాడు జిల్లా కలెక్టరు యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈరోజు అంతర్జాతీయ నర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఉత్తమ స్టాఫ్ నర్సుగా ఎన్నికైన కె.జ్యోతి ని, వారితో పాటు ఇతర సిబ్బందిని అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్తమ నాణ్యత, శాస్త్రీయ, నైతికత పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్న యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డు పొందడం పట్ల వైద్య ఆరోగ్య అధికారి ఎన్.వంశీకృష్ణను, ఇంజనీరింగ్, ప్యారామెడికల్, పారిశుద్య సిబ్బందిని అభినందిస్తూ కాయకల్ప అవార్డు సర్టిఫికెట్ ను అందించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రాలలో ఓపి సేవలు పెరగాలని, గ్రామాలలో ఎఎన్ఎం, ఆశా సిబ్బంది సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించాలని, గ్రామ ఆరోగ్య పోషణ కార్యక్రమాలలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు అవగాహన కలిగించాలని, సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని, తల్లిబిడ్డల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మల్లికార్జునరావు, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post