Press note. 12.1.2022. జిల్లాలో గీత కార్మిక సొసైటీలకు సంబంధించిన భూములను అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ జరుగకుండా పఠిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ అధికారులు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీమతి కృష్ణప్రియ, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి యాదయ్య, భువనగిరి సబ్ రిజిస్ట్రార్ లతో ఆమె గతంలో ప్రభుత్వం 45 గీత కార్మిక సొసైటీలకు సబ్సిడీ మీద మంజూరు చేసిన భూములను సమీక్షించారు. ఈత మొక్కలు, తాటి మొక్కల పెంపకంతో జీవనోపాధులు పొందాలని, అంతే కాని భూములు అమ్మడం లేదా కొనుగోలు చేయడం కానీ చేయకూడదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Share This Post