Press note. 12.5.2022.

గురువారం నాడు భువనగిరి పట్టణం లోని రైతు బజారులో (FPO) ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా సేంద్రియ కూరగాయల విక్రయ కేంద్రాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి ప్రారంభించారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ వారికి అందించిన ఎడల రైతులకు తగిన గిట్టుబాటు ధర లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు కూరగాయలను ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ వారి వద్ద కొంటే నాణ్యమైన కూరగాయలు పొందవచ్చునని, పండించిన రైతులకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, రైతులు పాల్గొన్నారు.

Share This Post