గతంలో ఈ కేంద్రానికి జిల్లా కలెక్టర్ రెండుఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ఉచితంగా అందించడం జరిగింది. అనంతరం మందనపల్లి గ్రామ పల్లె ప్రకృతి వనం సందర్శించి పల్లె ప్రకృతి వనం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం టంగుటూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్‌రెడ్డి, మండల అభివృద్ధి అధికారి జ్ఞాన ప్రకాష్, సర్పంచ్ పండరి, ఎ.పి.యం. మీనా, పంచాయతీ సెక్రటరీ మహేందర్ పాల్గొన్నారు.