వారం రోజుల్లోగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన వసతులపై పూర్తి స్థాయి ఎస్టిమేషన్ సమర్పించాలని , అలాగే పనులు ప్రారంభించాలని ఆమె విద్యాశాఖ అధికారులను, పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు.
అనంతరం వైద్య శాఖ అధికారులతో సమీక్షిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవల పనితీరును ఇంకా మెరుగుపరచుకోవాలని, ఆసుపత్రులలో శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, 108, 102 వాహనాల పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా క్షేత్రస్థాయిలో అంగన్వాడి, ఆశ సిబ్బంది సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో తల్లి బిడ్డల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలని తెలిపారు. కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం అందించిన సీసీ కెమెరాలను 15 రోజుల లోపల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ, విద్య , వైద్య అధికారులు పాల్గొన్నారు.