Press note. 20.1.2022. కోవిడ్ నియంత్రణకై రేపటి నుండి ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టాలని, వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని‌, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం నాడు ఆయన రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి. ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి ఇంటింటి ఆరోగ్యం సర్వే చేపట్టాలని, మూడు నాలుగు రోజులలో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా ఆశా, ఏఎన్ఎం, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులతో కూడిన టీములను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకోవాలని, కోవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే హోమ్ ఐసోలేషన్ కిట్ ను ఇవ్వాలని సూచించారు. ఇంటింటి సర్వేలో కుటుంబంలో అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడి సర్వే నిర్వహించాలని తెలిపారు. హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టీములు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించాలని, గతంలో నిర్వహించిన ఇంటింటి సర్వే అనుభవంతో పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, తక్కువ శాతం వ్యాక్సినేషన్ నమోదు అయిన జిల్లాలలో జిల్లా కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100 శాతం వ్యాక్సినేషన్ చేయాలని తెలిపారు. అదే విధంగా 15 నుండి17 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలున్న వారందరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని, ప్రతి గ్రామానికి, మున్సిపల్ వార్డుకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ వెళ్లే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యంతో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు వైద్య అధికారులతో సమీక్షిస్తుండాలని, ఆక్సిజన్ ప్లాంట్స్, సిలిండర్లు సమీక్షించుకోవాలని, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని, కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. బస్తీ దవాఖానాలలో కూడా పరీక్షలు చేయాలని, హోం ఐసొలేషన్ కిట్స్ ఇవ్వాలని వైద్య అధికారులకు సూచించారు. ఆసుపత్రులలో లక్షణాలు ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా వార్డు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం పెంపొందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు, మందులు ఉన్నాయనే అవగాహన కల్పించాలని, ప్రైవేటు ఆసుపత్రులలో అనవసర ఖర్చు చేయకుండా, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం కలిగేలా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాక్సిన్ ఇచ్చిన తర్వాతనే ఆన్లైన్ అప్లోడ్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా, ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని అన్నారు.

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఇంతవరకు కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్ గ్రేషియా త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎగ్జి గ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నాయని అన్నారు. మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వేలో లక్షణాలు ఉన్నవారికి మందుల వినియోగం గురించి విపులంగా చెప్పాలని, అవసరమైతే అవుట్ పేషెంట్ గా ఆస్పత్రిలో వైద్యం అందించాలని, కమ్యూనిటీ, ప్రాథమిక, ఏరియా ఆసుపత్రులలో ఓ.పి. సేవలకు ఏర్పాట్లు వెంటనే చేయాలనితెలిపారు.

వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు,ళ జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నా నాయక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, వైద్య అధికారులు పాల్గొన్నారు.

కోవిడ్ నియంత్రణకై రేపటి నుండి ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టాలని, వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని‌, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం నాడు ఆయన రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి. ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Share This Post