గురువారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో రేపటి నుండి చేపట్టబోయే ఇంటింటి ఆరోగ్య సర్వేను ఆమె సమీక్షించారు. ప్రతి ఇల్లు సర్వే చేయాలని, కుటుంబంలోని అందరి ఆరోగ్య పరిస్థితి పరీక్షించాలని, వ్యాక్సినేషన్ తీసుకున్నది, లేనిది వివరాలను నమోదు చేయాలని, లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని, మందులు వేసుకునే విధానం వివరంగా తెలుపాలని, అవసరమైతే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని తెలిపారు. అన్ని ఆస్పత్రులలో కోవిద్ ఓ.పి. సేవలు ప్రారంభించాలని, కోవిద్ కేర్ సెంటర్, ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సర్వేలో లక్షణాలు ఉన్న వారికి ప్రతిరోజు ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని కొనుక్కోవాలని, మందులు వేసుకునే విధానాన్ని వివరించాలని తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ సంబంధించి ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నా నాయక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు
