Press note. 21.1.2022. ఫీవర్ సర్వే లో ప్రతి ఇల్లు పరిశీలించి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఫీవర్ సర్వే టీములను ఆదేశించారు.

శుక్రవారం నాడు యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే ను ఆమె పరిశీలించారు. ప్రతి ఇల్లు సర్వే చేసి కుటుంబం లోని అందరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని, వ్యాక్సిన్ తీసుకున్నది, లేనిదీ నమోదు చేయాలని, లక్షణాలు ఉన్న వారికి వెంటనే ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని, మందులు వేసుకునే విధానం వివరంగా తెలపాలని, వారి ఆరోగ్య పరిస్థితిని రోజుకు రెండుసార్లు అడిగి తెలుసుకోవాలని, అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలని తెలిపారు. వాక్సిన్ తీసుకోని వారు ఉన్నట్లయితే వెంటనే వారికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఫీవర్ సర్వే లో ప్రతి ఇల్లు పరిశీలించి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఫీవర్ సర్వే టీములను ఆదేశించారు.

ఫీవర్ సర్వేలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ నరేందర్ రెడ్డి, ఆశా, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post