మంగళవారం జిల్లా కలెక్టర్ గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య మహిళా కేంద్రం పనితీరును పరిశీలించారు. గ్రామాలలో ఆశా వర్కర్ల ద్వారా ఆరోగ్య మహిళా కేంద్రాలలో నిర్వహించే పరీక్షల వివరాలను క్షేత్రస్థాయిలో మహిళలకు తెలిసేలా పనిచేయాలని, ఆసుపత్రులలో ఔట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలని, వైద పరీక్షలు, చికిత్స, మందులు అందించాలని, గ్రామ సభల ఏర్పాటు ద్వారా మహిళలతో సమావేశమై వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలని, తగిన సలహాలు అందించాలని, అవసరమైన వారికి పరీక్షలు, చికిత్స, మందులు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య మహిళా కేంద్రంలో జరిగే పరీక్షల వివరాలను వైద్యాధికారి డాక్టర్ హైమావతిని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో తహాశీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
…DPRO., YADADRI.