PRESS NOTE 22-04-2022 ఉపాధి హామిలో పూర్తి కాని పనులను వెంటనే పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టరు దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఎ.పిడి. లు, ఎ.పి.ఓ. లతో ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో నిర్వహిస్తున్న పనులను ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, గ్రామాలలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని సూచించారు. ప్లాంటేషన్ పనులు, భూమి అభివృద్ధి పనులు, రోడ్డు నిర్మాణ పనులు, పూడికితీత పనులు, కందకాల నిర్మాణం మొదలైన పనులకు సంబంధించి పూర్తి చేయాలని, పూర్తి కాని పనులను సత్వరమే పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయం పూటనే పనులు చేపట్టాలని, పనులు జరిగే చోట నీడ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పనులకు సంబంధించిన మస్టర్స్ వెంటనే పూర్తి చేయాలని, వర్క్ సైట్లో కూలీల నమోదు పకడ్బందీగా నిర్వహించాలని, పనుల ఫోటో కాప్చరింగ్ ఆన్లైన్ చేయాలని తెలిపారు. 418 గ్రామ పంచాయితీల లోని నర్సరీలలో దాదాపు 49 లక్షల మొక్కలు పెంచడం జరుగుతున్నదని, నర్సరీలలో వంద శాతం మొక్కల జర్మినేషన్ జరగాలని, ప్రతి మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోవాలని, వాటరింగ్ సకాలంలో చేపట్టాలని, నర్సరీలలో షేడ్ నెట్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. 2018-19 సంవత్సరంలో వంద రోజులు పూర్తి అయిన కుటుంబాలకు ఉన్నతి శిక్షణ కార్యక్రమానికి సంబంధించి 88 మందికి పోచంపల్లి, నల్లగొండ, హైదరాబాదులలో వారికి ఇష్టమైన వృత్తులలో శిక్షణ అందించడం జరుగుతున్నదని, ఇంకా అర్హత కలిగిన వారు ఉన్నట్లయితే వారికి కూడా శిక్షణ అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సమీక్షా కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.ఉపేందర్రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీమతి సునంద, అడిషనల్ డిఆర్డిఎ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post