press note. 22.12.2021. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా క్లెయిమ్ లను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా, ఓటు హక్కు ప్రాధాన్యత లపై స్వీప్ యాక్టివిటీలు నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను డిస్పోస్ చేసి, తుది ఓటర్ జాబితాను వచ్చే జనవరి 5 నాడు అన్ని గ్రామాలలో ప్రదర్శించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన గరుడ యాప్ వినియోగంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి, యాప్ వినియోగం పై వారికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి నెల కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ ల ద్వారా పరిశీలించి, ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ఈ.వి.ఎం. లను కొత్త గోడౌన్ లకు తరలించాలని, ఈవీఎం గోదాములను ప్రతి నెల తనిఖీ చేయాలని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు.

ఇప్పటి వరకు జిల్లాలో 5129 క్లెయిమ్ లు రావడం జరిగిందని, వీటిలో పలు కారణాల వలన 533 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని, 4579 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, భువనగిరి తాసిల్దార్ శ్యాంసుందర్రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీమతి వీరాబాయి, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

…….DPRO. YADADRI.

Share This Post