PRESS NOTE. 23-04-2022 ఈ నెలాఖరులోగా డబుల్ ఓట్లను పూర్తిగా తొలగించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.

శనివారం నాడు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారితో ఆమె మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఒకే ఫోటోతో రెండు మూడు ఉన్నట్లు ఫోటో సిమిలర్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా గుర్తించిన ఓట్లను బూత్ లెవల్ అధికారులు డోర్ టూ డోర్ సర్వే ద్వారా ఈనెల చివరి లోగా పరిశీలించి తొలగించడం జరుగుతుందని తెలిపారు. బూత్ లెవల్ అధికారుల పరిశీలనలో నివాసం ఉండే చోట ఉంచి మిగతా చోట్ల తొలగించడం జరుగుతుందని, అలాగే డెమోగ్రాఫికల్ సిమిలర్ ద్వారా ఒకే పేరుతో వున్నవి గుర్తించి నివాసం ఉండే చోట ఉంచి మిగతా చోట్ల తొలగించడం, ఒకే ఎపిక్ నెంబరుతో వున్నవి గుర్తించి నివాసం ఉండే చోట ఉంచి మిగతా చోట్ల ఫామ్ 7 ద్వారా తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు భువనగిరి నియోజక వర్గం సంబంధించి 4366 డబుల్ ఓట్లను గుర్తించడం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు 2336 పరిశీలించగా 1134 ఒరిజినల్ గా, 1132 డుప్లికేట్ గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 2803 డబుల్ ఓట్లను గుర్తించడం జరిగిందని, ఇప్పటి వరకు 791 పరిశీలించడం జరిగిందని, వీటిలో 367 ఒరిజనల్ గా, 303 డుప్లికేటుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. మిగతావి ఈ నెలాఖరు లోగా క్షేత్రస్థాయిలో డోర్ టూ డోర్ సర్వే ద్వారా డబుల్ ఓట్లను గుర్తించి తొలగించడం పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నుండి బట్టు రామచంద్రయ్య, సిపిఐ పార్టీ నుండి యాసాల అశోక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎం.డి. మజర్, కలెక్టరేటు ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీమతి నాగలక్ష్మి, డిప్యూటీ తహశీలుదారు శ్రీమతి నీలిమ, ఐ.టి. సిబ్బంది శ్రీరామ్ పాల్గొన్నారు

ఈ నెలాఖరులోగా డబుల్ ఓట్లను పూర్తిగా తొలగించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.

Share This Post