PRESS NOTE. 23-04-2022 ట్రాన్స్ జెండర్స్ ను మెప్మా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.

శనివారం నాడు కలెక్టరేటులోని కాన్ఫరెన్స్ హాలులో ఆమె ట్రాన్స్ జెండర్స్ తో సమావేశమై వారి సమస్యలను చర్చించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్స్ సమస్యలను పరిష్కరిస్తామని, వారిని మెప్మా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. వారి పెన్షన్ల కోసం ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపాలని, ఆధార్ కార్డులో ట్రాన్స్ జెండర్ నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ కల్పించాలని, వారికి మెప్మా సంఘాల ఏర్పాటుతో యూనిట్స్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని, ఆయుష్మాన్ భవ, ఈ శ్రమ్ క్రింద నమోదు చేయాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు వస్తే 181 సఖీ సెంటర్కు కాల్ చేయాలని, భద్రత, రక్షణ పొందాలని వారికి సూచించారు.

ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ కు ఐడి కార్డులు మంజూరు చేశారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, మెప్మా సూపరింటెండెంట్ లోకేశ్వర్రెడ్డి, ట్రాన్స్చండర్స్ ప్రతినిధులు కస్తూరి, భవానీ, మాధవి, కుమారి, స్వప్న, పండు, ఇతర ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు.

ట్రాన్స్ జెండర్స్ ను మెప్మా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.

Share This Post