Press note. 24.9.2022. వయోవృద్ధుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ICDS అధికారులను ఆదేశించారు.

శనివారం నాడు తన ఛాంబర్ లో అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్స్, పాంప్లెట్స్, హ్యాండ్ బ్యాండ్స్ విడుదల చేశారు. వృద్ధుల సంరక్షణకు కట్టుబడతానని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 25వ తేదీన వివిధ ప్రాజెక్టులలో, వృద్ధాశ్రమలలో వృద్దులకు ఆటల పోటీలు, 26 వ తేదీన జిల్లా స్థాయిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, 27 వ తేదీన ఆరోగ్యం, పరిశుభ్రత, సంరక్షణ పైన అవగాహన కార్యక్రమం, 28 వ తేదీన వివిధ గ్రామాలలోని సర్పంచ్ లకు, గ్రామ ప్రజలకు వయోవృద్ధుల సంరక్షణ చట్టంపైన అవగాహన కార్యక్రమాలు, 29 వ తేదీన జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థుల తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలతో వివిధ కార్యక్రమాలు, 30 వ తేదీన జిల్లా కేంద్రంలో వయోవృద్ధులతో కలిసి ర్యాలీ, వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని, కార్యక్రమాలలో వయోవృద్ధులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి శ్రీమతి కృష్ణవేణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మండల ఉపేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట సి.ఐ. సైదయ్య, సిడిపిఓ లు, సూపరింట్డెంట్ శశికళ, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి, ట్రిబ్యునల్, అప్పీలేట్ ట్రిబ్యునల్ సభ్యులు, వయోవృద్ధుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Share This Post