Press note. 25-04-2022 ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి. శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం నాడు కలెక్టరేటు కార్యాలయంలోని మీటింగ్ హాలులో ప్రజల నుండి వివిధ శాఖలకు సంబంధించి 33 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు.

ప్రజలు అందించిన ఫిర్యాదులలో రెవిన్యూ శాఖ 27, ఆలేరు మున్సిపాలిటీ, మహిళా సంక్షేమ శాఖ, జిల్లా ఎస్.సి. సంక్షేమ శాఖ, ఎక్సైజు శాఖ, నీటిపారుదల శాఖ, విద్యా శాఖ ఒక్కొక్కటి చొప్పున మొత్తం 33 ఫిర్యాదులు అందాయి.

కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టరు శ్రీమతి విజయకుమారి, కలెక్టరేట్ ఎ.ఓ. నాగేశ్వర చారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post