Press note. 25.5.2022. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశమై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా జూన్ 2వ తేదీన నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, కలెక్టరేట్ లో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, వేడుకలలో అన్ని శాఖలు తమ శాఖల ద్వారా నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని, లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలని, ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణి చేయాలని, రాష్ట్ర అవతరణ రోజున కలెక్టరేట్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖలు
తమ శాఖల ద్వారా నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు. పోలీస్ పరేడ్ కు అవసరమైన స్థలాన్ని పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ రెడ్డి కి సూచించారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు.

Share This Post