నేడు వయోవృద్ధురాలిని జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాలతో,ఆలేరు సి డి పి ఓ గారి సహకారంతో శారాజిపెట గ్రామపంచాయతీ లో సర్పంచి, సెక్రెటరీ, సూపర్వైజర్ గార్ల సమక్షంలో వృద్దురాలి కూతురు రత్నమాల మరియు మనవరాలు భార్గవి లకు సఖి కౌన్సిలర్ శ్రీదేవి గారు, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి గార్లు కౌన్సిలింగ్ చేసి వృద్ధురాలిని వారి కూతురుకు అప్పగించి భాద్యతగా, ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది.వృద్ధురాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ముగ్గురు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.