Press Note 27-04-2022 బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు మండలాలలో స్థల సేకరణ చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు కలెక్టరేటు మీటింగ్ హాలులో మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఎపిడి, పంచాయితీరాజ్ ఎఇ లతో పల్లెప్రగతి, ఉపాధిహామీ తదితర పనులను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మండలంలో బృహత్ పల్లెప్రకృతి వనాలకు సంబంధించి కనీసం 5 స్థలాలను తప్పనిసరిగా గుర్తించాలని, స్థల సేకరణ జరగని చోట సంబంధిత మండల తహశీలుదార్ల సమన్వయంతో స్థల సేకరణ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జూన్ మాసంలో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్నందున బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 2022 సంవత్సరంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటాల్సిన ప్రదేశాలను గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేయాలని, వర్షాలు ప్రారంభం కాగానే గుంతలు తీసి మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అసంపూర్తిగా వున్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్స్ వచ్చే పది రోజులలో పూర్తి చేయాలని, వచ్చే మే 20 తేదీ నాటికి పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి గ్రామాలలో కూలీల శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో 200 మందిని సమీకరించాలని, కూలీలకు కనీస వేతనం వచ్చే విధంగా పనులు నిర్వహించాలని తెలిపారు. ఆజాదీసే అంత్యోదయ పథకం క్రింద దేశంలో గుర్తించిన 75 జిల్లాలలో మన జిల్లా ఒకటని, రేపటి నుండి 70 రోజులు కార్యక్రమాలు జరుగనున్నాయని తెలిపారు. అమృత్ సరోవర్ పథకం క్రింద మన జిల్లాలో 75 నీటి సంరక్షణ కేంద్రాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని, 2022 ఆగష్టు నాటికి పూర్తి చేసి వర్షపు నీటిని ఆదా చేసేలా అన్ని చర్యలను తీసుకోవాలని, స్వాతంత్య్ర దినోత్సవ రోజున నీటి సంరక్షణ కేంద్రాల వద్ద జాతీయ జెండా ఎగురవేసి వేడుక చేయాలని తెలిపారు. మన ఊరు మన బడి క్రింద కాంపౌండ్ వాల్స్, కిచెన్లెడ్స్, టాయ్లెట్స్ ఎస్టిమేషన్స్ జనరేట్ చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్రెడ్డి, సూరజ్కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్.కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి ఎం.ఉపేందర్రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీమతి సునంద, అడిషనల్ డిఆర్డిఎ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు మండలాలలో స్థల సేకరణ చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు.

Share This Post