Press note. 27.12.2021. జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా అలాట్మెంట్ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అందజేశారు.

సోమవారం నాడు భువనగిరి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించి ఉత్తర్వులను అందజేయడం జరిగింది. 29 శాఖలకు సంబంధించి 201 మంది ఉద్యోగులు ఉత్తర్వులను పొందారు. మిగతా శాఖలకు రేపు కౌన్సిలింగ్ ద్వారా అలాట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జి.ఓ.యం.ఎస్. నెo. 317 ద్వారా జిల్లా స్థాయి కమిటీలో చేపట్టిన ఉద్యోగుల కేటాయిoపులకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్ష్యతన జరిగిన జిల్లా స్థాయి కేటాయిoపుల సమావేశమునకు జిల్లా అధికారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉద్యోగులకు కౌన్సిల్ ద్వారా పోస్టులను కేటాయిoచడo జరిగినది. కౌన్సిలింగ్ లో ఉద్యోగులు కోరిన పనిచేయు ప్రదేశాలను కేటాయిoచడo జరిగినది. సంబంధింత పోస్టులలో కేటాయిoపు జరిగిన ఉద్యోగులు జాయిన్ కావలసి వున్నది.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మొర నాగేశ్వర చారి, జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్, జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మందడి ఉపేందర్రెడ్డి, తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘం జిల్లా అధ్యక్షులు సి.జగన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయూస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం జిల్లా కార్యదర్శి పొదిల రవికుమార్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Share This Post