వానకాలం 2022 నకు సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి వ్యవసాయ అధికారులకు, ఎరువులు విత్తన డీలర్లకు పలు సూచనలు చేయడం జరిగినది.
జిల్లా కలెక్టర్ గారు రైతులకు అనుకూలంగా వారి సందేహాలను తెలపడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ తయారు చేయవలసిందిగా సూచించారు. ఈ హెల్ప్లైన్ నెంబర్ (08685293312) ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట నమోదు, రైతుబంధు, రైతు బీమా, కొనుగోలు కేంద్రాలు తదితర సమాచారం సంబంధించిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి పొందవచ్చునని సూచించారు. విత్తన డీలర్లు కల్తీ విత్తనాలను అమ్మకుండా తగు చర్యలు తీసుకొన వలసినదిగా సూచించారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించుటకు తగు సూచనలు, చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
విత్తన ఎరువు, పురుగు మందుల డీలర్లు అందరూ చట్టానికి అనుగుణంగా నడుచుకుంటామని ఒక ధ్రువీకరణ పత్రాన్ని వారి షాప్ నందు పొందు పరచ వలసినదిగా అదనపు కలెక్టర్ డీలర్లకు సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సూచనలను తు.చ.తప్పకుండా పాటించవలసినదిగా సూచించారు. విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు మరియు హెచ్ టి కాటన్ విత్తనాలను ఎట్టి పరిస్థితులలోనూ రైతులకు అమ్మకూడదని తెలిపారు. వానకాలం 2022 సీజనుకు నియమించబడిన స్క్వాడ్ టీములు పూర్తిగా తనిఖీలు నిర్వహించి నివేదికను జిల్లా వ్యవసాయ అధికారి గారికి సమర్పించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.