Press note. 28.4.2022 ప్రజల అవసరాల దృష్ట్యా నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్రెడ్డి అధికారులకు సూచించారు.

గురువారం నాడు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లు, విద్య, వైద్యం, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, పరిశ్రమలు, పల్లె ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులతో ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె పురోగతిలో ఉన్న పనులను ఒక నెలలో పూర్తి చేయాలని, ఎక్కడైతే ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ పనులు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు. ప్రజల అవసరాల దృష్ట్యా పనులను వెంటనే పూర్తి చేయాలని, సాంక్షన్ అయిన పనులను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని సూచిస్తూ కొత్తగా గుర్తించిన పనులకు ఎస్టిమేషన్స్ తయారు చేయాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.ఉపేందర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఇ శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ ఎస్ఇ శంకరయ్య, జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి సునంద, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post