Press Note. 29-04-2022 ధాన్యం కొనుగోలు వేగంగా నిర్వహించాలని, రైతుల ఖాతాలలో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు భువనగిరి మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూనిక, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు, గన్నీ బ్యాగుల ఏర్పాటుతో ధాన్యం కొనుగోళ్ళు వేగంగా నిర్వహించాలని, టాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేసుకోవాలని, రైతులకు సకాలంలో వారి ఖాతాలలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రంలో మంచి నీటి వసతి, టెంట్ సౌకర్యం కల్పించాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమతి పరిమళా దేవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకట్ రెడ్డి, పాక్స్ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి, వార్డు మెంబర్ వేణుగోపాల్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ నరసింహ, తదితరులు పాల్గొన్నారు .

Share This Post