Press Note 29-04-2022 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు.

శుక్రవారం నాడు ఆయన అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఎం.ఎల్.సి. ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణారెడ్డి, అన్ని మండలాల జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరైనారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును శాఖల వారిగా జిల్లా అధికారులు వివరిస్తూ, సభ్యులు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, గత వానాకాలం సీజన్లో జిల్లాలో 4 లక్షల అరవై వేల ఎకరాలలో పంటల సాగు చేయడం జరిగిందని, ఈ యాసంగిలో 1,65,718 ఎకరాలలో వరి, 10,927 ఎకరాలలో ఇతర పంటలు వేయడం జరిగిందని తెలిపారు. గత 2021-22 సంవత్సరంలో జిల్లాలో 281 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 38,887 మంది రైతుల నుండి 2,83,054 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 554 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతుబంధు పథకం క్రింద 2021 వానాకాలంలో 2,14,417 మంది రైతులకు 288 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, గత యాసంగి సీజన్లో 2,25,114 మంది రైతులకు 292 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిథి క్రింద 71307 మంది రైతులకు గత ఫిబ్రవరి వరకు 14 కోట్ల 26 లక్షలు విడతల వారిగా జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతు బీమా పథకం క్రింద 2021-22 సంవత్సరంలో 1,23.197 మంది రైతులు అర్పులుగా గుర్తించి బీమా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 2314 మంది రైతులు మరణించగా 5 లక్షల చొప్పున 111 కోట్ల 90 లక్షలు వారి నామినీ ఖాతాలలో జమ చేసి వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలిచిందని తెలిపారు. వ్యవసాయ ద్వారా జిల్లాలో 92 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మాణం పూర్తి చేసుకుని రైతులకు సాగు పంటల వివరాలను, విధానాలను అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత అదనంగా మరో 14 గోదాములు నిర్మించుకోవడం జరిగిందని, మరో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిలువ ఉంచవచ్చునని తెలిపారు. జిల్లాలో 26 లక్షలతో 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. గొర్రెల పెంపకం సంబంధించి ఇప్పటి వరకు 838 గొర్రెల యూనిట్లను సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 161 పెద్ద చెరువులు, 1043 చిన్న చెరువులు వున్నాయని, మూసీ పరివాహక ప్రాంతంలో మరో 20 చెరువులు వున్నాయని, వీటిపై 134 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 10 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలతో మొత్తం 8929 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. గత సంవత్సరం 1115 చెరువులలో 3 కోట్ల 16 లక్షల చేపపిల్లలు, 9 చెరువులలో 12 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసి సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2395 మంది మత్స్యకారులు ఆర్ధిక లబ్ది పొందినారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు TS – iPASS ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో సత్వర అనుమతులు కల్పించడం జరిగిందని, గత మార్చి చివరి వరకు జిల్లాలో 621 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, 321 పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, 23904 మందికి ఉపాధి కల్పన జరిగిందని తెలిపారు. ఎస్.సి, ఎస్.టి., దివ్యాంగులకు టీ ప్రైడ్ క్రింద గత మార్చి చివరి వరకు 582 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్రింద ఇప్పటి వరకు 5 లక్షల 16 వేల పని దినాలు కల్పించి 12 కోట్ల 94 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని, ఉపాధి పనుల ద్వారా 2022-23 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 49 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా అన్ని గ్రామ పంచాయితీలలోని నర్సరీలలో మొక్కలను పెంచడం జరుగుతున్నదని తెలిపారు. వైకుంఠధామాలను అన్ని గ్రామాలలో పూర్తి చేయడం జరిగిందని, మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అవసరమైన పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీ గోడల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రతి నెలా 85వేల 37 మంది లబ్దిదారులకు 20 కోట్ల 70 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతున్నదని, గత 2019 జూలై నుండి ఇప్పటి వరకు 10,242 కొత్తగా ఫించన్లు మంజూరీ కొరకు పంపడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 83 సదరన్ క్యాంప్లు నిర్వహించి 1556 మందికి పరీక్షలు నిర్వహించి 1235 మందిని అర్ఫూలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 14,841 స్వయం సహాయక సంఘాలలో 1,56,689 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఋణ సదుపాయ లక్ష్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇప్పటి వరకు 8934 సంఘాలకు 400 కోట్ల 50 లక్షలు ఋణాలు అందించడం జరిగిందని తెలిపారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి గ్రామీణ సడక్ యోజన పథకం క్రింద చేపట్టిన 16 రోడ్ల నిర్మాణ పనులలో 15 పనులు పురోగతిలో వున్నాయని తెలిపారు. ఉపాధి హా మో క్రింద 139 గ్రామ పంచాయితీ భవనాలకు గాను 113 భవనాలు పూర్తి అయ్యాయని, 17 భవనాలు పురోగతిలో వున్నాయని తెలిపారు. గ్రామీణ మంచినీటి సరఫరా సంబంధించి మొత్తం 17 మండలాలలకు గాను అంతర్గత పైప్ లైన్, వాటర్ ట్యాంక్ ల నిర్మాణానికి సంబంధించి కొత్తగా 556 వాటర్ ట్యాంక్లకు గాను 556 ట్యాంక్లు పూర్తి చేయడం జరిగిందని, 2008 కి .మీ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, మొత్తం 1,55,932 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. మొత్తం 729 ఆవాసాలకు గాను 729 ఆవాసాలు పూర్తి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 83 రైతు వేదికలకు, 641 ప్రభుత్వ పాఠశాలలకు, 769 అంగన్వాడీ పాఠశాలలకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నీటి పారుదల శాఖకు సంబంధించి గత 2021-22 సంవత్సరానికి గాను పది చెక్ డ్యాముల నిర్మాణం కొరకు హైడ్రాలిక్ అనుమతులు వచ్చాయని, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి OT- 2 కాలువ పనులు పురోగతిలో వున్నాయని, గండి చెరువు తూము, పైప్ లైన్ పనులు పూర్తి అయ్యాయని, ప్యాకేజీ 16 ప్రధాన కాలువ 74 కి.మీ. నుండి 94 కి.మీ. వరకు పనులు పురోగతిలో వున్నాయని తెలిపారు. 6 చెక్ డ్యాముల నిర్మాణం కొరకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, 4 చెక్ డ్యాములు మొదలు అయ్యాయని, 2 గ్రౌండింగ్ దశలలో వున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 16 ప్యాకేజీ క్రింద 57 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నదని, మాతా శిశు సంరక్షణకు అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, గత మార్చి వరకు 17333 మంది తల్లులకు కెసిఆర్ కిట్స్ అందించినట్లు తెలిపారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారాయని, పారిశుద్య చర్యలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మొత్తం 421 గ్రామ పంచాయితీలకు గాను 421 గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేసి పారిశుద్యం, మొక్కలకు వాటరింగ్ తదితర చర్యలతో గ్రామ సీమలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని తెలిపారు. వసతి గృహాల సంక్షేమంలో భాగంగా 19 షెడ్యూలు కులాల వసతి గృహాలలో 1503 విద్యార్ధులు వసతి, విద్య పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో 8 గిరిజన బాల బాలికల వసతి గృహాలలో 850 మంది వసతి, విద్య సదుపాయాలు పొందుతున్నారని తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 గురుకుల పాఠశాలల్లో 1183 మంది వసతి, విద్యా సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. దళిత బంధు పథకం క్రింద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు పది లక్షల చొప్పున 7 కోట్ల 60 లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని, లబ్దిదారులకు వారు కోరుకున్న రంగాలలో అవగాహన కలిగించి ఇప్పటి వరకు 85 యూనిట్లను 69 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దళిత బంధు పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో వంద కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను 337 కుటుంబాలను గుర్తించడం జరిగిందని, అందులో 287 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేయడమైనదని, వారికి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని, 62 యూనిట్లు అమలు పరచబడినాయని తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో జిల్లాలో 251 పాఠశాలలు ఎంపిక కాబడినాయని, దీనిలో భాగంగా మరమ్మత్తులు, వసతి సౌకర్యాలు పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. సమీక్షలో ఇంకా ఇతర శాఖల ద్వారా అమలు జరుగుతున్న పనులను సమీక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు.

Share This Post