Press note.29.3.2023. చిన్నారుల పెరుగుదల, పోషణ పట్ల శుక్రవారం సభలు, గృహ సందర్శనల ద్వారా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి సూచించారు.

బుధవారం నాడు భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామం అంగన్వాడి కేంద్రాన్ని ఆమె సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా పిల్లల బరువు, పెరుగుదల రిజిస్టర్ లను పరిశీలించారు. పిల్లల బరువు ఎత్తులను ప్రతినెలా రికార్డు చేయాలని, వారి తల్లులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలని, మెనూ ప్రకారం సక్రమంగా పౌష్టికాహారాన్ని అందించాలని, పిల్లల ఆరోగ్యంపై శుక్రవారం సభలు, గృహ సందర్శనల ద్వారా తల్లులకు, గర్భిణీ స్త్రీలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్ సునంద కు సూచించారు.

…..DPRO., YADADRI.

Share This Post