బుధవారం నాడు భువనగిరి మండలం లోని వడాయిగూడెం గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా 4, 5 తరగతుల వారితో తెలుగు, ఇంగ్లీష్ పాఠాలను బిగ్గరగా చదివించారు. పిల్లలు బాగా చదవడం పట్ల మెచ్చుకొని చదవడంలో ఇంకా మెరుగుపడాలని అన్నారు. విద్యార్థులు ఉచ్చారణా దోషాలు లేకుండా చదివేలా చూడాలని, తప్పులను పరిశీలించి సవరించాలని, ఇంగ్లీషు లాంగ్వేజీ జాగ్రత్తలను విపులంగా తెలుపాలని, కొన్ని పదాలను ప్రాక్టీస్ చేయించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న కు సూచించారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి ఉన్నారు.
…DPRO., YADADRI.