Press note. 3.2.2023. శుక్రవారం నాడు అడ్డగూడురు మండల సందర్శనలో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ చౌళ్ళ రామారం గ్రామం లోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో పాల్గొన్నారు.

ఆరుగురు గర్భిణులు, ఇరవై మంది పిల్లలను ఉద్దేశించి, మండల పరిషత్ అధ్యక్షులు దర్శనాల అంజయ్య, సర్పంచ్ నిమ్మనగోటి జోజి, ఎస్సీ కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ అధికారి శ్యాం సుందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రమౌళి, వార్డు సభ్యులు మందుల కిరణ్ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి, వాళ్లకు, అంగన్వాడి పిల్లలకు అందుతున్న ఆహారం గురించి ఆరా తీసి, ఆ ఆహారాన్ని పరిశీలించడం జరిగింది. అంగన్వాడీ పిల్లలు చాలా చక్కగా వారు నేర్చుకున్న విషయాల గురించి ప్రదర్శించారు

అంగన్వాడీ కేంద్రం టీచర్ ఈనాటి అంశమైన ఆహారంలో విటమిన్. ఎ ప్రాముఖ్యతను గర్భిణులకు వివరించారు.

Share This Post