వసతి గృహం లోని శౌచాలయాన్ని, వంటగది, డార్మినేటరీని, స్టాక్ రూములను పరిశీలించారు. పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి ప్రసన్న కు సూచించారు. విద్యార్థులకు రెండు జతలు చొప్పున డ్రస్సులను పంపిణీ చేశారు.
అనంతరం మోత్కూరు ఎస్.సి. బాలుర సంక్షేమ వసతి గ్రహాన్ని తనిఖీ చేశారు. బాలురకు రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ చొప్పున అందజేశారు. పదవ తరగతి బాలుర రీడింగ్ క్లాస్ పరిశీలించారు.