Press note. 30.5.2022. ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లకు సూచించారు.

సోమవారం నాడు ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టవలసిన అంశాలపై పలు సూచనలు జారీ చేశారు.

వచ్చే జూన్ 3వ తేదీ నుండి 18 వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాల పనులను పరిశీలించారు. రోడ్ల వెంట మొక్కలు నాటుటకు గ్రామాల పరిధిలోని రోడ్లను నడక ద్వారా పరిశీలించి అన్ని రోడ్లలో హరితహారం కార్యక్రమం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఒక రోజు వైకుంఠధామం సందర్శించి నీటి వసతి, కరెంటు సరఫరా, మౌలిక సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. ట్రెజరీ లో సబ్మిట్ చేసిన బిల్లులు జూన్ 2వ తేదీలోగా క్లియర్ అవుతాయని తెలిపారు. జూన్ 2 వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మండలంలో 2 తెలంగాణ గ్రామీణ క్రీడా మైదానాలను ప్రారంభించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని, అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా పెద్ద మొక్కలు నాటాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిహెచ్. కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, మండల స్పెషల్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.

Share This Post