Press Note. 30.7.2021. హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.

Press Note. 30.7.2021.

హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు తన ఛాంబర్లో నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, ల్యాండ్రీ షాపులకు ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అధికారులతో సమీక్షిస్తూ, గ్రామ పంచాయతీలలో, పట్టణాలలో అందరికీ తెలిసే విధంగా అవగాహన కల్పించాలని, ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క షాప్ యజమాని లబ్ధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సునంద, ఎపిడి సాయన్న, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, రమేష్, జగన్, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 250 యూనిట్ల వరకు ఉచితం అనే విషయాన్ని వారికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీలలో మండల పంచాయతీ అధికారుల ద్వారా పంచాయతీ సెక్రెటరీలకు, తద్వారా లబ్ధిదారులకు తెలుపాలని, పట్టణ ప్రాంతాలలో ప్రతి ఒక్క షాప్ కు విషయం తెలిసేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ కవర్ కావాలని ఆదేశించారు. పాత కనెక్షన్ ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా, కొత్తవారు కూడా కనెక్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, పేదలకు లబ్ధి చేకూరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని తెలిపారు. నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీ సొసైటీల నుండి అందరూ దరఖాస్తు చేశారు అనే దృవీకరణ పత్రాలు పొందాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని ఆదేశించారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో లబ్ధి పొందేందుకు ఎంతమంది ఉన్నారో పరిశీలించాలని, వారందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ నుండి వచ్చే బిల్లులో 250 యూనిట్ల వరకు బిల్లు మాఫీ అయినదీ లేనిదీ పరిశీలించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు.

…DPRO. KMR.

Share This Post