PRESS NOTE 31-1-2023 మంగళవారం నాడు కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితుల పునరావాసం క్రింద అందిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ సర్వే నెం. 107 లో విద్యుత్, నీటి వసతుల ఏర్పాట్లపై భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టరు పమేలా సత్పతి పంచాయితీరాజ్, నీటిపారుదల, ఆర్ డబ్లూఎస్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షించారు.

ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల నిర్మాణానికి కావలసిన విద్యుత్, నీటి వసతి కోసం టెండర్ ప్రక్రియ | పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. తిమ్మాపూర్ గ్రామంలో గల ఇండ్లకు, స్థలాలకు రావలసిన నష్ట పరిహారం త్వరలోనే ప్రభుత్వం నుండి మంజూరు చేయించి భూనిర్వాసితులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితులకు గతంలో 655 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 7 లక్షల 61 వేల రూపాయల చొప్పున మొత్తం 50 కోట్లు ఇవ్వడం జరిగిందని, మిగిలిన 400 మందికి ఈరోజు మంగళవారం సాయంత్రం వరకు ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ అమౌంట్ లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుందని జిల్లా కలెక్టరు తెలిపారు. మొత్తం 1055 మందికి పునరావాసం క్రింద హుస్నాబాదు గ్రామంలోని సర్వే నెం. 107 లో ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను రేపు బుధవారం నాడు లాటరీ విధానం ద్వారా ఎవరెవరికి ఏ ప్లాటు కేటాయించడమనేది లబ్దిదారునికి తెలుపడం జరుగుతుందని అన్నారు .

సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, భువనగిరి ఆర్.డి.ఓ. భూపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, విద్యుత్ శాఖ సూపరింటెండెంగ్ ఇంజనీరు శ్రీధర్, నీటిపారుదల శాఖ సూపరింటెండెంగ్ ఇంజనీరు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఖుర్షీద్, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూ.ఎస్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్, ఎంపిపి శ్రీమతి నిర్మల, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి లత, ఇంజనీర్లు గిరిధర్, వెంకట ప్రసీద, మహేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

…..DPRO., YADADRI.

Share This Post