Press note. 6.1.2022. జిల్లా మహిళా సమాఖ్యల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మహిళా సమాఖ్యలను అభినందించారు.

గురువారం నాడు జిల్లా మహిళ సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన మహిళా సమాఖ్య 51వ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా సాధికారత దిశలో జిల్లా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయని, దీనికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నానని, మహిళా సాధికారత దిశగా రాబోయే రోజులలో అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. బ్యాంకు లింకేజీ విషయంలో NPA జీరో శాతానికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. మహిళలు కొత్త విషయాలను తెలుసుకొనుటకు, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కొరకు వేరే రాష్ట్రంలో క్షేత్ర సందర్శన చేయాలని సూచించారు. గ్రామాలలో మహిళా సంఘాల సమావేశాలు నిర్ణీత సమయంలో జరగాలని, తాను కూడా హాజరు అవుతానని, మహిళలు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అన్ని సెర్ప్ కార్యక్రమాలలో మన జిల్లా ముందుండాలని తెలిపారు.

కార్యక్రమంలో మహిళా సంఘాలకు ఆర్ధిక అక్షరాష్యతలో భాగంగా బ్యాంకు లింకేజీ, CIF, జీవనోపాధులు, స్త్రీనిధి గురించి, అలాగే ఆరోగ్యం, పోషణ, సామాజిక అంశాలను చర్చించడం జరిగింది.

సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ DRDO జోజప్ప, DPM లు ఆనంద్, శ్రీను, సునీల్, APm లు, SN RM సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఎ.పి.ఎం. లు, సి.సి. లు 200 దప్పట్లు జిల్లా కలెక్టర్ కు అందజేశారు అందచేశారు.

…..DPRO. YADADRI.

Share This Post