Press note. 7.5.2022 అంగన్ వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టికాహారాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి కోరారు.

శనివారం నాడు పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామం అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ దినోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. సాధారణ ప్రసవం వలన తల్లీబిడ్డకు క్షేమమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందే సేవలను అందరూ పొందాలని అన్నారు. ప్రసవం తర్వాత గంట లోపల తల్లిపాలు శిశువుకు అందిస్తే రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకమని అన్నారు. అందరూ అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని, ఐరన్ టాబ్లెట్లు తీసుకోవాలని, తద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయని అన్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, అంగన్వాడీ సిబ్బంది సూచించిన సలహాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రథమ గర్భం సాధారణ ప్రసవం అయితే తర్వాత గర్భం కూడా సాధారణ ప్రసవానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు పొందాలని తెలిపారు. వడ దెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాడాలని, ఉదయం 11 గంటల లోపు నీడ లోనే పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వీరాబాయి, హెల్త్ అసిస్టెంట్ భవాని, గ్రామ సర్పంచ్ పద్మా రెడ్డి, ఆశా వర్కర్ అలివేలు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తూనిక, తేమ కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగుల ఏర్పాటుతో ధాన్యం కొనుగోళ్ళు వేగంగా నిర్వహించాలని, టాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేసుకోవాలని, రైతులకు సకాలంలో వారి ఖాతాలలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, వేసవి తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రంలో మంచి నీటి వసతి, టెంట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమతి పరిమళా దేవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఈశ్వర్, పాక్స్ అధ్యక్షులు లింగం యాదవ్, తదితరులు పాల్గొన్నారు .

తదుపరి ఇ జూలూరు జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించి మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post