Press note. 9.5.2022 బాల బాలికలు క్రీడలలో రాణించాలని, శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి బాల బాలికలకు సూచించారు.

సోమవారం నాడు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరములలో భాగంగా అనాజ్ పూర్ గ్రాములో ఏర్పాటు చేసిన ఖో ఖో, వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరమును ఆమె ప్రారంభిoచారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మరియు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరములు మే 1 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జిల్లా లోని గ్రామీణ ప్రాంతంలో (10), అర్బన్ ప్రాంతంలో (05) వివిధ క్రీడా అంశాలలో శిక్షణను ఇవ్వబడుతున్నదని, ఈ శిబిరాలలో 8 నుండి 14 సం. లోపు బాల బాలికలకు శిక్షణ ఇవ్వబడుతుందని, ఉదయం 6 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గo. వరకు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. అనాజ్ పూర్ గ్రామములో ఏర్పాటు చేసిన ఖో ఖో, వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంబించడం చాల సంతోషంగా వుందని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. శిక్షణ పొందుతున్న బాల బాలికలు ఆటలలో ప్రావిణ్యం పొందాలని, భవిష్యత్తులో క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అకాంక్షిoచారు.

జిల్లా యువజన, క్రీడల అధికారి కె.ధనంజనేయులు మాట్లాడుతూ, అనాజ్ పూర్ గ్రామములో ఏర్పాటు చేసిన ఖో ఖో, వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని గ్రామములోని బాల బాలికలు ఉపయోగించుకోవాలని, శిక్షణ పొందిన వారికి అనంతరం ధ్రువ పత్రములు అందచేయబడతాయని అన్నారు.

కార్యక్రములో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, గారు, జిల్లా విద్యాధికారి నరసింహ, అనాజ్ పుర్ గ్రామం సర్పంచ్ ఎదునురి ప్రేమలత మల్లేశం, అనాజ్ పూర్ గ్రామ MPTC గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్ , గ్రామ ఉప సర్పoచి మైలారం వెంకటేష్, SGF జిల్లా సెక్రెటరీ విజయ్ సాగర్, ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా జాయింట్ సెక్రటరీ నాతి కృష్ణముర్తి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీళ్ళ దశరథ రెడ్డి, SMC చైర్మన్ సత్యనారాయణ, మెంబెర్స్ మల్లేష్, శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు ఎస్ కరుణ్, క్యాంపు ఇంచార్జ్ ఆంజనేయులు, శ్రీశైలం, రమేష్ రెడ్డి, పిట్ట వెంకటేష్, బాత్క అశోక్, పంచాయతీ కార్యదర్శి మలేఖ, గ్రామ యువకులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post