Press Note and Photos on 29.05.2021 – Sri K.T.Rama Rao, Hon’ble Minister for MA&UD inaugurated PVNR Expressway ramps at Upparpally.

ఫోటో రైట్ అప్స్ :

1. ఉప్పర్ పల్లి వద్ద పీవీఎన్ఆర్ అప్ అండ్ డౌన్ ర్యాంపు ల శిలాఫలకాన్ని
ఆవిష్కరిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కె.టి. రామారావు గారు

2. ఉప్పర్ పల్లి డౌన్ ర్యాంప్
వద్ద రిబ్బన్ కత్తిరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గారు

3. ఉప్పర్ పల్లి డౌన్ ర్యాంపు పై నడుస్తున్న మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ శ్రీ సోమేష్ కుమార్ గారు

4 &5. ఉప్పర్ పల్లి పీవీఎన్అర్ ర్యాంప్ ల ప్రారంభోత్సవానికి ముందు ప్రజా ప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీ కె టి రామారావు గారు

6. ఉప్పర్ పల్లి డౌన్ ర్యాంప్ నుంచి కిందికి వెళ్లి తిరిగి ఆప్ ర్యాంప్ పైకి వస్తున్న మంత్రి శ్రీ కేటీఆర్ గారి కాన్వాయ్

7. ఉప్పరపల్లి డౌన్ ర్యాంప్ రోడ్డు

8 & 9. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పైన ఇంజినీరింగ్ అధికారులకు మరిన్ని సూచనలు ఇస్తున్న కమిషనర్ అర్వింద్ కుమార్

Item

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే అప్ అండ్ డౌన్ ర్యాంప్ లను
ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను శనివారం మధ్యాహ్నం ఉప్పర్ పల్లి వద్ద మున్సిపల్ శాఖ
మంత్రి శ్రీ కె.టి.రామారావు గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు, జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి జి.విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి లత, అత్తాపూర్ కార్పోరేటర్ శ్రీమతి సంగీత గారు, ఎమ్మెల్సీలు శ్రీమతి వాణి దేవి గారు, శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, శ్రీ ఎగ్గె మల్లేశం గారు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, హైదరాబాద్ ఎంపీ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెలే శ్రీ కాలే యాదయ్య లతోపాటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గారు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ అరవింద్ కుమార్ గారు, హెచ్ఎండిఎ సెక్రెటరీ బి.ఎం. సంతోష్ గారు, హెచ్ఎండిఎ చీఫ్ ఇంజనీర్ శ్రీ బి.ఎన్.రెడ్డి, ఎస్.ఈలు యూసుఫ్ హుస్సేన్, పరంజోతి, ఈఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు

డౌన్ అప్ ర్యాంపుల ప్రారంభోత్సవం సందర్భంగా పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గారి చేత రిబ్బను కత్తిరింపజేశారు.

మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ అరాంఘర్
వరకు 11.6 కి.మీ పొడువైన పివి ఎన్ అర్ ఎక్స్ ప్రెస్ వే కి
ఇరువైపుల ఎక్కి, దిగేందుకు ర్యాంపులను హెచ్ఎండిఎ నిర్మిస్తున్నది.

గతేడాది ఫిబ్రవరి నెల్లో అదనంగా ఆప్ అండ్ డౌన్ ర్యాంపుల నిర్మాణం ప్రారంభించారు.

రూ.22.08 కోట్లతో ఈ రెండు ర్యాంపుల నిర్మాణం సాగుతుండగా, పనులు పూర్తయ్యాయి. మెహదీపట్నం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో పిల్లర్ నెం. 161 వద్ద ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కేలా , ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న క్రమంలో అత్తాపూర్ వద్ద దిగేలా పిల్లర్ నెం. 163 దిగేందుకు ఈ ర్యాంపులను హెచ్ఎండీఏ నిర్మించింది.

కొత్తగా నిర్మించిన పీవీఎన్అర్ ఎక్స్ ప్రెస్ వే అప్ అండ్ డౌన్ ర్యాంపుల ద్వారా రాకపోకలతో
వాహనదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

Share This Post