తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ కార్యాలయం
సోమాజిగూడ, హైదరాబాద్ –500082
పత్రిక ప్రకటన : తేదీ: 01.06.2021
రైతుజన బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో
కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిన ధాన్యం కొనుగోళ్లు కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ రికార్డుస్థాయి కొనుగోళ్లు
ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా
ప్రత్యామ్నాయ పంటలవైపు ఆలోచన చేయాలి
రైతాంగానికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి
రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో సౌభాగ్యం నింపడానికి రైతుజన బాంధవుడు, బంగారు తెలంగాణా దార్శనికుడు, రైతుబిడ్డ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు గడిచిన ఏడు సంవత్సరాల్లో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం ముఖచిత్రమే మారిపోయింది. వరిసాగు విస్తీర్ణం, దిగుబడులు, కొనుగోళ్ళలో కనీ వినీ ఎరుగని ప్రగతిని సాధించాం. ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశనంలోనే మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతూ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
“ఉమ్మడి రాష్ట్రంలో రైతులు కరెంటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. విత్తనాలు, ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు. గిట్టుబాటు ధర కోసం ధర్నాలు చేశారు, నీళ్ల కోసం బోర్లు వేసి అప్పులపాలయ్యారు.. ఇలా సవాలక్ష సవాళ్లతో అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి చీకటి పరిస్థితులను పారదోలడమే కాకుండా, రైతన్నను అన్ని రకాలుగా ఆదుకోవడాన్ని ఒక యజ్ఞంలా భావించారు. వారి అభివృద్ధి కోసం గతంలో ఎన్నడు, ఎక్కడా జరుగనంత ప్రయత్నం మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నది.
ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్రంలో అభివృద్ధిపర్చడానికి అలుపెరుగని రీతిగా చేపట్టిన సంక్షేమ చర్యలతో అతికొద్ది కాలంలోనే రాష్ట్రంలో వ్యవసాయరంగం ముఖచిత్రమే మారిపోయింది.
వ్యవసాయం లాభసాటిగా మారాలి.. రైతులు ధనిక రైతులుగా మారాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రిగారు గడిచిన ఆరేళ్లుగా చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు రైతాంగ అభివృద్ధికి ఎంతగానే దొహదపడ్డాయి. దశాబ్దాలపాటు పాడావుపడ్డ బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. కోటి ఎకారాలను సాగులోకి తేవాలని కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రపంచం యావత్తు ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, గ్రామాల్లోని చెరువును నింపారు. ప్రతి గ్రామంలో చెరువులు కళకళలాడుతున్నాయి. గతంలో కరెంటు కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. నేడు స్వరాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటలు కరెంటును ఉచితంగా అందిస్తున్నారు. వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ఎరువులు, విత్తనాల కోసం రైతుబంధు పథకం ద్వారా ప్రతి పంటకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బు వేస్తున్నారు. ఏ కారణం చేత రైతు మరణించిన అతడి కుటుంబానికి 5 లక్షల రైతు భీమా అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. రైతులంతా ఒక దగ్గర కూర్చొని వ్యవసాయంపై చర్చించుకొనేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేశారు. పంట అమ్ముకోవడానికి రైతులకు అందుబాటులో ఉండే విధంగా కళాలను ఏర్పాటు చేయడంతో పాటు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
ఆరుగాలం శ్రమించి పంటచేతికి వచ్చిన తర్వాత అమ్ముకోవడం కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2014-15లో 3,500 కొనుగోలు కేంద్రాలు ఉండగా నేడు 14వేలకు చేరుకోవడం గమనార్హం.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమకు అండగా ఉంటారు. పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తారనే నమ్మకం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోత్బలంతో కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలోనూ రైతులు పొలాల్లో శ్రమించి ఇబ్బడి ముబ్బడిగా ధాన్యాన్ని పండించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రెండు కోట్లకు పైగా ధాన్యాన్ని పండించారు.
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ సిఎం కెసిఆర్ గారి సూచనల మేరకు తనకు తాను తీర్చిదిద్దుకుంటున్నది.
ఈ క్రమంలో గత ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి ఒక కోటి 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించిగా. ఈ ఏడాది వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి ఇప్పటి వరకు కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని మన ముఖ్యమంత్రిగారు చేసి రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా పంటలను కొనుగోలు చేయడంలేదు.
70 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో రైతాంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, ఇందుకు తెలంగాణ ప్రజానీకం గర్వపడుతోంది.
వరిసాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని దాటి తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానానికి చేరువ అవుతున్నది. రైతులు ఇంక ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వ్యవసాయం చేస్తూ, బంగారు పంటలు పండించేలా వారి ఆదాయవనరులు మరింత పెరిగేలా, ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా రైతన్న దృష్టి సారించాల్సి వున్నది.
దేశంలో దొడ్డురకం బియ్యానికి డిమాండ్ తగ్గుతుందనే ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఏడాది వానాకాలంలో సన్నాలు సాగు చేయాలని పిలపునిస్తే ప్రతిపక్షాలు విమర్శించాయి.
కానీ వానాకాలంలో దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర వ్యాపారస్తులు దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేశారు.
ప్రతి సీజన్ కు నిబంధనలు మారుస్తున్న ఎఫ్ సీఐ వచ్చే సీజన్ నుండి దొడ్డురకం బియ్యాన్ని తీసుకునే పరిస్థితిలేదు, ఈ నేపథ్యంలో రైతులు ఒకసారి ఆలోచన చేయాలి… మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలి, కమర్షియల్ పంటలవైపు ఆలోచన చేయాలి.
70 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వని ప్రాధాన్యతను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు రైతాంగానికి ఇచ్చారు. రైతుల ఆర్థిక వనరులు పెంచడానికి గడిచిన ఏడు సంవత్సరాల్లో చేపట్టిన చర్యలు రైతాంగ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. రైతులు ఆర్థికంగా మరింత బలపడాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూసపద్ధతిలో కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రిగారి ఆలోచనకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే రైతాంగం ఆలోచన విధానం చాలా మారింది, ఇంకా మారాల్సిన అవసరం ఉంది.
రైతులు, వ్యవసాయ నిపుణులు ఒకే దగ్గర కూర్చోని ఏ ఏ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, ఏ పంటలు వేస్తే మంచి ధర వస్తుంది. వంటి అంశాలను చర్చించుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రిగారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలను ఏర్పాటు చేశారు.
ఏ నేల ఏ పంటకు ఉపయోగపడుతుంది, ఏ పంట ఎప్పుడు వేయాలి, ఏది వేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఒక ఇంటి పెద్దలాగ గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రతిక్షణం రైతుల గురించే ఆలోచన చేస్తున్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, కందులు, ఆయిల్‌ఫామ్ వంటి పంటల పై దృష్టి సారించాలి, అలాగే పట్టణాలకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో పళ్లు, కూరగాయలు, వంటి హార్టికల్చర్ పై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు.
యాసంగిలో ఇప్పటి వరకు 72.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి జారీచేయబడినది.