Press Note on 18.04.2020 – Sri G.Jagadish Reddy, Hon’ble Minister for Energy

నిఘా నీడలో సూర్యపేట | డ్రోన్ కెమరాలతో  కదలికల గుర్తింపు | బీబీగూడెం లో ఇంటింటి సర్వే  | హైపో క్లోరైడ్ ద్రావణంతో పట్టణంలో పిచికారీ | 50 తైవాన్ స్ప్రే లతో క్లోరినేషన్  | అదనంగా మరో క్యారంటైన్ | మెడికల్ షాప్ ల యజమానులతో ప్రత్యేక సమీక్ష కు ఏర్పాట్లు 

ఎప్పటికప్పుడు పట్టణ పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి | కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ ల విస్తృత పర్యటన | కరోనా కట్టడికై ఆంక్షలు కఠినం | లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం | రెడ్ జోన్ పరిధిలో ప్రజలు రేఖ దాటొద్దు

నిత్యావసర సరుకుల తో పాటు,కూరగాయల అందజేతకు మున్సిపల్ అధికారులు కార్యాచరణ

కరోనా కల్లోలం తో తల్లడిల్లుతున్న సూర్యపేట పట్టణంలో పరిస్థితిని దారిలో పెట్టేందుకు అధికారులు దృష్టి సారించారు.

పరిస్థితి ఉగ్రరూపం దాలుస్తుండడం తో గురు,శుక్రవారలలో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి శనివారం ఆసాంతం హైదరాబాద్ నుండి పరిస్థితులు మానిటరింగ్ చేశారు.

మంత్రి జగదీష్ రెడ్డి అదేశంతో రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం ఉపశమన చర్యలకు ఉపక్రమించింది.

అందులో భాగంగా ఈ ఉదయం నుండి రెడ్ జోన్ ఏరియాలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ లు విస్తృతంగా పర్యటించగా పట్టణ ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకుల సరఫరా పై మున్సిపాలిటీ దృష్టి సారించింది.

అదే విదంగా మొట్టమొదటిసారిగా చివ్వేంల మండలం బీబీగూడెం లో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసిన నేపద్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది.ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి పాజిటివ్ కేసు బాధితుడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను సేకరించింది.

దానికి తోడు గురు,శుక్రవారాలలో మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కొనసాగింపుగా ఈ ఉదయం నుండి పట్టణంలో అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అగ్నిమాపక యంత్రాలతో రెడ్ జోన్ ఏరియాలో  హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ జరిపించారు.అంతటితో వదలకుండా యింటి యజమానులు అనుమతి తీసుకొని ప్రతి ఇంట్లో ఆ ద్రావణాన్ని పిచికారీ చేసేందుకు గాను 50 తైవాన్ స్ప్రే లతో క్లోరినైషన్ చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.పాజిటివ్ ల సంఖ్య పెరగడంతో పాటు కరోనా వైరస్ సోకిన జిల్లాలో రెండవ స్థానానికి చేరుకున్న సూర్యపేట లో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినం చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ లు ప్రకటించారు. అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో క్యారంటైన్ ల సంఖ్య నాలుగు నుండి ఐదు కు పెంచినట్లు అధికారులు ప్రకటించారు.

*మెడికల్ షాప్ యజమానులతో ప్రత్యేక సమీక్ష*

ఇదిలా ఉండగా మెడికల్ షాప్ యజమానులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలంటూ శనివారం సాయంత్రం ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వులననుసరించి సమావేశం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

జలుబు,దగ్గు,స్రద్ది తో పాటు జ్వరం తో బాధ పడే వారు వైద్యులతో నిమిత్తం లేకుండా నేరుగా మెడికల్ షాప్ లకు వచ్చి మందులు కొనుక్కునే అవకాశాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాజిటివ్ అనుమానం తో గోప్యత పాటించే వారిని టెస్ట్ చెయ్యడానికి దోహద పడుతుందన్నది ప్రభుత్వ యోచన.అందుకు అనుగుణంగా త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.

Share This Post

Post Comment