Press Release and Photos on 09.06.2021.

పత్రికప్రకటన                                                                                  09.06.2021

భూసారాన్ని పెంచుకుని భూతల్లిని రక్షించుకోవాలి

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్లుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి

(టి.సాట్సాఫ్ట్ నెట్)

రైతులు సేద్యానికి జీవన ఎరువులు వాడి భూసారాన్ని పెంచుకోవాలని రైతుబంధు రాష్ట్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం టి-సాట్ వేదికగా ‘సమగ్ర ఎరువుల యాజమాన్యం-పచ్ఛి రొట్ట ఎరువులు మరియు జీవన ఎరువుల వాడకం’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక ప్రసార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి మాట్లాడుతూ భూసారాన్ని పెంచుకోవడంతో పాటు భూతల్లిని రక్షించుకునే విధంగా రైతుల చర్యలుండాలని కోరారు. ఎరువులు తక్కువ మోతాదులో సరైన సమయంలో వాడి అధిక దిగుబడులు పొందే విధంగా సాగు పద్దతులు ఎంచుకోవాలని సూచించారు. పూర్వ కాలంలో కోడి, పశువుల, గొర్రెల ఎరువులతో పాటు మక్కిన వ్యర్థాల ద్వార తయారైన పదార్థాలను ఎరువులుగా వాడి పంటలు పండించేవారని, ఫలితంగా భూమిలో సారాన్ని మన పూర్వీకులు కాపాడారని గుర్తు చేశారు. రైతులు వెదజల్లే పద్దతి ద్వార విత్తనాలను విత్తుకుని ఖర్చు, శ్రమ తగ్గించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు పదే పదే రైతులకు సూచిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ సాగులో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనా విధానాలను, రైతుకు అనువైన పద్దతులను ఆచరణలో పెట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1.60 లక్షల రైతు బంధు సమితి సభ్యులు ప్రయత్నం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా ధాన్యం కొనుగోలు చేసే పద్దతి పైనే మనం పంటలు విత్తుకోవాలని సూచించారు. ఏ రాష్ట్రమూ కొనుగోలు చేయని విధంగా అనేక సమస్యలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం అధిక ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. వ్వవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు మాట్లాడుతూ వానా కాలం సాగుకు రైతులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుండి రైతుబంధు మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన మేరకు మాత్రమే పంటలు విత్తుకుంటే మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. సైంటిస్టు సురేంద్రబాబు మాట్లాడుతూ పచ్చి రొట్ట ఎరువుల వాడకం అన్ని విధాలా యోగ్యమైందని సూచించారు. రాష్ట్రంలోని సుమారు 250 మండలాల్లో బాస్వరం 50 శాతంపైగా ఉందని భూసార పరీక్షలు స్పష్టం చేసుతున్నాయని,  వాటికి అనుగుణంగానే పంటలను విత్తుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి రైతులు ఫోన్ ద్వార చర్చలో పాల్గొని తమ తమ సమస్యలను నివృత్తి చేసుకున్నారు.

Share This Post