Press Release on 08.06.2021 – T-SAT

పత్రిక ప్రకటన                                                                                                       08.06.2021.

నేడు టి-సాట్ స్టూడియోకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

   (టి.సాట్సాఫ్ట్ నెట్)

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరో మారు ఈ నెల తొమ్మిదవ తేదీ బుధవారం రోజున టి-సాట్ స్టూడియోకు రానున్నారు. రైతుబంధు సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ‘‘సమగ్ర ఎరువుల యాజమాన్యం, పచ్చి రొట్ట-జీవన ఎరువుల వాడకం’’ అనే అంశంపై నిర్వహించే ప్రత్యేక ప్రత్యక్ష్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగే లైవ్ కార్యక్రమం ఈ నెల తొమ్మిదవ తేదీ బుధవారం మధ్యాహ్నాం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు కొనసాగనుంది. వ్యవసాయ సీజన్ ఆరంభమైన సందర్భంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలోని రైతులను కలిసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందు వలన ప్రభుత్వ టెలివిజన్ నెట్వర్క్ టి-సాట్ ద్వార రైతులను చైతన్య పరిచేందుకు గత 20 రోజుల్లో మంత్రి నిరంజన్ రెడ్డి రెండు మార్లు హాజరై రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై  తమ అధికారులతో కలిసి పలు సలహాలు-సూచనలు చేశారు. ఈ నెల తొమ్మిద తేదీన మరో మారు టి-సాట్ నెట్వర్క్ ద్వార మరో అంశంపై రైతులను సాగుకు సమాయత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 040 23540326, 23540726 టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4309 కు కాల్ చేయవచ్చని సూచించారు.

Share This Post