Principal Secretary to Govt. (MA&UD) – Implementation of prevention of cruelty to Animals (Pet Shop) Rules

పత్రికా ప్రకటన                                                                తేది.05.06.2021

జిహెచ్ఎంసి పరిధిలో నడుస్తున్న పెంపుడు జంతువుల షాపులు తప్పనిసరిగా కేంద్ర పర్యావరణ అటవి వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రూపొందించిన పెంపుడు జంతువుల పై క్రూరత్వ నిషేధిత చట్టం- 2018 ప్రకారం  రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్  కలిగి ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.తదనుగుణంగా అన్ని PET SHOPS లకు నోటీసులు జారీ చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ తో పాటు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులను ఆయన ఆదేశించారు.  జిహెచ్ఎంసి నుండి ట్రేడ్ లైసెన్సులు పొందిన అనంతరం తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందుటకు నిర్దేశిత ఫారం ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని నోటీసుల లో స్పష్టం చేయాలని సూచించారు. పెంపుడు జంతువుల సంరక్షణ, అటువంటి షాపుల నిర్వహణలో ఈ చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే పెంపుడు జంతువుల షాపులను నడిపేందుకు,  వ్యాపారo చేసేందుకు, పెంపుడు జంతువులు అమ్మకాలను రిటైల్, హోల్ సేల్ గా జరిపేందుకు వీలున్నదని తెలిపారు. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందుటకు  పెంపుడు జంతువుల షాపులను నిర్వహించే యాజమాన్యాలకు 4 వారాల సమయాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. అప్పటికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లు పొందని పెంపుడు జంతువుల షాపుల పై చట్టపరమైన చర్యలు తీసుకొని,మూసివేయనున్నట్లు తెలిపారు.

ఈ చట్టం ప్రకారం ప్రతి Pet Shop రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, జి.హెచ్.యం.సి నుండి  Valid trade license ను కలిగివుండాలి. జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 70 PET షాపు లను నడుపుతున్నారని, దాదాపు ఏ ఒక్కదానికి కూడా GHMC నుండి పొందిన Valid trade license తో పాటు రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుండి పొందిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదని తెలిపారు. జంతు సంక్షేమ చట్టాలు , నిబంధనలు , సూచనల అమలుకు , పెంపుడు జంతువులు ఆరోగ్యం, రక్షణ చర్యలతో పాటు , జంతువులపై క్రూరత్వంను అరికట్టుటకు రూపొందించిన లక్ష్యాల అమలులో భాగంగా రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందుటను తప్పనిసరి చేశారు. అదే విధంగా జంతు సంరక్షణ నిబంధనలను అతిక్రమించిన డాగ్ బ్రీడర్స్ పై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

—————————————————————————-

జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post