RG గార్డెన్ లో 2021-22 సం. వానాకాలం ధాన్యం కోనుగోలు అంశంపై సమావేశం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన     తేది:3.11..2021 వనపర్తి

జిల్లాలో వరి ధాన్యం కోనుగొలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత  అధికారులను ఆదేశించారు.  వానాకాలం ధాన్యం కోనుగోలు అంశం పై   మంగళవారం  సంబంధిత అధికారులతో బుధవారం రాజానగరం రోడ్డులో గల అర్జీ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో  ప్రస్తుత వానాకాలంలో 73 118 హెక్టార్లు లో వరి సాగు జరిగిందని, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం  దిగుబడి వస్తుందని అంచనా వేసిన  ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా    పనిచేయాలని మంత్రి ఆదేశించారు.   జిల్లాలో  ప్రస్తుతం 249  ధాన్యం కొనుగొలు కేంద్రాల  ఏర్పాటుకు   పరిశీలిస్తున్నామని తెలియచేసారు.

ధాన్యం కోనుగోలు చేసే సమయంలో  నాణ్యత పై  కఠినంగా వ్యవహరించాలని,  నాణ్యత ప్రమాణాల అంశం పై   వ్యవసాయ విస్తరణ అధికారులు,  సెంటర్ ఇంచార్జిలు భాద్యత వహించాలని,  రైతు వేదికలో వీరికి  అవగాహన కల్పించాలని  మంత్రి ఆదేశించారు. వానాకాలం ధాన్యం కోనుగోలు కోసం జిల్లాలో  అవసరమైన   టార్ఫాలిన్  కవర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు,  ధాన్యం శుద్ది యంత్రాలు,  తేమ శాతం కొలిచే యంత్రాలు  అందుబాటులో ఉంచాలని , తూనికలు కొలతల శాఖ,  మార్కెటింగ్ శాఖ అధికారులను  మంత్రి  ఆదేశించారు. రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుని మట్టి ఇసుక లేకుండా తేమ 14 శాతం ఉండేలా వరి ధాన్యం కేంద్రానికి తీసుకురావాలని అన్నారు.

జిల్లాలో ఉన్న ప్యాడీ క్లీనర్లను  మేజర్  సెంటర్లకు  కేటాయించాలని, అనంతరం  ప్రతి ధాన్యం కోనుగోలు కేంద్రం వద్ద తప్పని సరిగా  ప్యాడీ క్లీనర్ ఉండేలా  చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. జిల్లాలో  ఏ ప్రదేశంలో ముందు పంట కోతలు జరుగుతాయనే  సమాచారం  సేకరించి,  టోకెన్ పద్ధతి ద్వారా ముందస్తుగా ఎక్కడా ధాన్యం కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దాని  పై నివేదిక అందించాలని వ్యవసాయ అధికారిని  ఆదేశించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ తొలగించే అంశం,  తాలు నిర్మూలించడానకి  ప్యాడీ క్లీనర్ల వినియోగం  తదితర అంశాల పై వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున రైతులకు అవగాహన  కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

రైతులు  ధాన్యం  కోత అనంతరం  వాటిని ఆరబెట్టుకొని,  14% లోపు తేమ, 1% లోపు చెత్త తాలు, 1% లోపు మట్టి రాళ్లూ, 5% లోపు  పురుగు తిన్న, రంగు మారిన ధాన్యం, 3% ముడచుకు పోయిన ధాన్యం , 6% తక్కువ రకముల మిశ్రమం ఉండే  విధంగా  తయారు చేసి  కోనుగోలు కేంద్రాలకు తీసుకోని    రావాలని మంత్రి  విజ్ఞప్తి చేసారు. రైతులు  తీసుకొని వచ్చే  గ్రేడ్  ‘ఎ’ రకం ధాన్యానికి రూ.1960/-,  సాధారణ ధాన్యానికి రూ.1940/- క్వింటాళ్లుకు మద్దతు ధర చెల్లించి కోనుగోలు చేయాలని అన్నారు.   పెరిగిన మద్దతు ధర పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ధాన్యం కోనుగొలుకు అవసరమైన  గన్ని బ్యాగులు ఎప్పటికప్పుడు  ఏర్పాటు చేయాలని, అదే విధంగా   ధాన్యం  రవాణా అంశంలో సమస్య ఉత్పన్నం  కాకుండా చర్యలు తీసుకోవాలని  మంత్రి  ఆదేశించారు.

జిల్లాలో ఉన్న మిల్లులను  కోనుగొలు కేంద్రాలకు మ్యాపింగ్  చేయాలని  జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి  మంత్రి  సూచించారు.  ధాన్యం కోనుగొలు  కేంద్రాలో కనీస మౌలిక వసతులు మూత్రశాలలు, మంచి నీరు, సబ్బులు ఏర్పాటు చేయాలని, కోవిడ్ 19 దృష్ట్యా  మాస్కు ధరించడం,  సానిటైజర్  వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.       ధాన్యం కోనుగొలు కేంద్రాలో విద్యుత్ సమస్య ఉత్పన్నం  కాకుండా  తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖను  ఆదేశించారు.   ధాన్యం కోనుగొలు కేంద్రం మరియు రైస్ మిల్లుల వద్ద   హమాలీలు అందుబాటులొ ఉండేలా చర్యలు తీసుకోవాలని,  సకాలంలో  లోడింగ్,  అన్ లోడింగ్  ప్రక్రియ జరగాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు వరి ధాన్యం కేంద్రాలకు తీసుకో రాకముందే టోకెన్లు ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతులు వరి ధాన్యం ఆరబెట్టుకుని ఇసుక మట్టిపెళ్లలు లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. ఒక రకానికి చెందిన ధాన్యము, మరొక రకానికి చెందిన ధాన్యము తో కలప రాదని, సరైన గ్రేడింగ్ చేయాలని ఆమె సూచించారు. రైతులు తమ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ తో అనుసంధానం చేసిన తర్వాత మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆమె తెలిపారు. ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాతనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు. ఆధార్ కార్డు, జిల్లా కలెక్టర్ చే నియమించబడిన అధికారి ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ జత చేయాలని, బ్యాంకు ఖాతా పని చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారి నుండి ధృవీకరించుకోవాలని ఆమె తెలిపారు. ధాన్యం తూకం వేసిన తరువాత రైతులు విధిగా కొనుగోలు రసీదు పొందాలని ఆమె సూచించారు. రైతులు ధాన్యం అమ్మటం లో ఏదైనా సమస్యలు ఉత్పన్నం అయినట్లయితే సంబంధిత పౌరసరఫరాల అధికారులను, ఆర్ డి ఓ ను, తాసిల్దార్ ను, సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించాలని జిల్లా కలెక్టర్ వివరించారు.
అనంతరం జిల్లా పౌరసరఫరాల శాఖ కు సంబంధించిన “వరి పంట” గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్,  జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ (సివిల్ సప్లై డి.ఎం) అనిల్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి నరసింహులు , జిల్లా మార్కెటింగ్  అధికారి స్వరణ్ సింగ్, జిల్లా కోపరేటివ్ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, జిల్లా తూనికల కొలతల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, PACS చైర్మన్, ఎం.పి.పి లు, జడ్.పి.టి.సి. సభ్యులు, మెప్మా, mms, ఐకెపి, పి పి కమిటీ సభ్యులు, ఇంచార్జ్ ఏవో, ఏ ఈ ఓ లు, వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
…………..

జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయనైనది.

Share This Post