Dt.03-06-2021
PRESS NOTE
As per the instructions of Hon’ble Chief Minister Sri K.Chandrashekar Rao, Sri K.Keshava Rao, Hon’ble MP and Chairman, P.V.Narasimha Rao Centenary Celebration Committee informed that Centenary Celebrations of former Prime Minister of India, closing ceremony will be conducted in a befitting manner.
Sri K.Keshava Rao along with Chief Secretary Sri Somesh Kumar,IAS., Smt Vani Devi, MLC/Member, Sri Chandrashekar, Member, P.V.Narasimha Rao Centenary Celebration Committee, Sri Arvind Kumar,IAS., Principal Secretary, MA&UD/Metropolitan Commissioner, HMDA, Sri Mamidi Harikrishna, Director, Culture paid a visit to Necklace Road to identify suitable location for the erection of Statue.
He said that as part of closing Ceremony on 28.06.2021 which marks the closing of the Centenary Celebrations, the Statue of Sri P.V.Narasimha Rao will be unveiled on Necklace Road which was renamed as P.V.Narasimha Rao Marg.
పత్రికా ప్రకటన తేది.03.06.2021
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎంపీ మరియు శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ శ్రీ కె.కేశవరావు తెలిపారు.
గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్న శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణి దేవి,శ్రీ చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మరియు హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ అరవింద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ లతో కలిసి నెక్లెస్ రోడ్డును ఆయన సందర్శించారు.
ఈనెల 28న శ్రీ పీవీ నరసింహారావు గారి శత జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డు నందు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనువైన వివిధ స్థలాలను పరిశీలించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు శ్రీ కె.కేశవరావు తెలిపారు. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా మార్చుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం