Sri Errabelli Dayakar Rao, Hon’ble Minister for PR & RD – Distribution of Groceries.

ఉప్పిడి ఉపాసమైనా ఉందాం…మనల్ని మనం కాపాడుకుందాం

సంకల్పం ఉంటే…సాయానికి కొదువలేదు

రాజకీయాలకు తావు లేదు

పేదలను ఆదుకోవడంలో రాజీ లేదు

దాతలు, ధాతృత్వానికి వెరవడం లేదు

కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీరు తుడవండి

మానవతను చాటండి

ప్రజాసేవకు పునరంకితం కండి

మీ పదవులకు వన్నె తీసుక రండి

ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి పిలుపు

దేవరుప్పులలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు నిత్యావసర కిట్ల పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

దేవరుప్పుల, ఏప్రిల్ 20ః
సంకల్పం ఉండాలే కానీ, సాయానికి కొరత లేదు. దాతల ధాతృత్వానికి కొదువలేదు. మనసుంటే మార్గముంటుంది. సేవ చేయడానికి రెండు చేతులు మాత్రమే కాదు. కాస్త సహృదయం కూడా ఉండాలి. ప్రజాప్రతినిధులు తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాజకీయాలకు తావీయకొండి. మానవతను చాటండి. పోటీ చేయడానికి లక్షలు ఖర్చ చేయడం కాదు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే అసలైన నాయకత్వ లక్షణం. మీ ప్రాంత ప్రజలను ఆదుకుంటూ మీరు నిజమైన ప్రజాప్రతినిధులుగా నిలబడండి… అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మంత్రి ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు ఎర్రబెల్లి ట్రస్టు తరపున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. .

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ సతీమణి శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నడుస్తున్న తమ ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో 20 ఏండ్ల కిందనే ఎన్నో సేవలు చేశామని గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే వర్దన్నపేట నియోజకవర్గంలో ఆరోగ్య శిబిరాల ద్వారా 80వేల మందికి వైద్యం అందించామన్నారు. 350 మందికి గుండె శస్త్రచికిత్సలు చేయించామన్నారు. కొద్దిపాటి ఖర్చు అవుతుందని భావించి ప్రారంభించిన ఆ కార్యక్రమానికి ఆరోజుల్లోనే రూ.4 కోట్లు ఖర్చయిందన్నారు. అయితే, అనేక మంది దాతులు మందుకు వచ్చి మందులు కూడా ఉచితంగా ఇచ్చారని, పరీక్షలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా చేశారని గుర్తు చేశారు. అలా సంకల్పం అనేది ఉండాలి. మనసుంటే మార్గమున్నట్లేనని మంత్రి చెప్పారు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే చాలు. నిధులు సమస్య కాదు అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రం, దేశం, మొత్తం ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ దశలోనూ సీఎం కెసిఆర్ గారు ప్రజలను ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపట్టారు. నిరుపేదలకు 12కిలోల బియ్యం ఇస్తున్నారు. ప్రతి నెలా రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.1500 ఇస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులూ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వలస కూలీలకు 12కిలోల బియ్యంతోపాటు వ్యక్తికి రూ.500 ఇస్తున్నారు. కుటుంబం ఉంటే రూ.1500 ఇస్తున్నారు. కూరగాయలు, పండ్లు, పాలు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అద్భుతమైన వైద్యం అందిస్తున్నారు. మనం చేయాల్సిందల్లా లాక్ డౌన్ ని పాటించడమేనని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చరు.

మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలు, దేశాల కంటే కూడా ఎంతో నయంగా ఉంది. ఉపసమైనా ఉందాం మన ప్రాణాలను మనం రక్షించుకుందాం. కష్టాలు ఉన్నప్పుడే పది మందిని ఆదుకోవాలి. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు. వాటిని ఖర్చు చేయడం కూడా కళే… అందుకే మీ మీ స్థాయిల్లో ప్రజలకు అండగా నిలవాలని ప్రజాప్రతినిదులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో….దేవరుప్పులకు చెందిన యాదవరెడ్డి వెయ్యి మందికి నిత్యావసర సరుకులు అందించడానికి ముందుకు వచ్చారు. ఆయనకు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నిరుపేదలు, ఆటో డ్రైవర్లు… తదితరులు పాల్గొన్నారు.

Share This Post