Sri Errabelli Dayakar Rao, Hon’ble Minister for PR & RD held a review meeting with officials.

Press Release:                                                           Dt.10.05.2021

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పెండింగ్ లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 217 కోట్ల 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను అన్ని గ్రామ పంచాయితీలకు విడుదల చేసిందని, ఈ నిధులతో పెడింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడానికి గ్రామపంచాయితీలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు  పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారులను కోరారు. హైదరబాద్ లోని బంజారా హిల్స్ లో నున్న మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ ఉన్నత అధికారుల సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ది పథకాలను మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎం‌జి‌ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఎస్ పనులు ఉదృతంగా జరుగుతున్నాయని, అందువల్ల పని ప్రదేశాల్లో కూలీలకు కరోన వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కూలీలు తప్పక చేతులను శానిటైజన్ చేసుకోవడం తో పాటుగా మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించి పనులు చేసే విధంగా సంబందిత అదికారులు, ఉద్యోగులు చూడాలని ఆయన కోరారు. అదే విదంగా ప్రస్తుత ఎండ కాలంలో కూలీలు వడ దెబ్బ పడకుండ సంబందిత అదికారులు, ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఆరోగ్య సర్వేలో  ఆశ వర్కర్లతో సర్పంచులు, పంచాయితీ సెక్రెటరీలు సమన్యయంతో పనిచేసి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా విజయ వంతంగా జరిగే విదంగా చూడాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 1554 కోట్ల రూపాయల వ్యయంతో 12270 వైకుంఠ దామల నిర్మానాన్ని చేపట్టడం జరగగా, ఇందులో 11250 పూర్తి అయ్యాయని, 1470 వివిధ దశలల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. కరోన దృష్యా పూర్తి అయిన వైకుంఠ దామలను వెంటనే వినియోగం లోకి తీసుకురావాలని  ఆయన ఆదేశించారు. అదే విదంగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న అన్ని పనులను వెంటనే పూర్తి చేయలని ఆయన కోరారు.

టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన PMGSY పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోరారు.

కరోన నివారణ చర్యలలో భాగంగా సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు గ్రామాలు పారిశుధ్యముగా ఉండే విధంగా కృషి చేయాలని  ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమము కింద నాటిన మొక్కలను నీటిని పోసి మొక్కలు ఎండి పోకుండా చూడాలని ఆయన సర్పంచులను, పంచాయితీ కార్యదర్శులను కోరారు. నాటిన మొక్కలలో 100 శాతం సంరక్షించడనికి సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు భాద్యత తీసుకోవాలని ఆయన కోరారు.

గ్రామాల్లో కోవిడ్ సోకిన రోగులకు వారి ఇంట్లో హోమ్ ఐషోలేషన్ ఉండటానికి సమస్యలు ఉన్నట్లయితే సంబందిత గ్రామములోని ప్రభుత్వ పాఠశాలల్లో , ప్రభుత్వ విద్యార్థుల వసతి గృహాల్లో ఐషోలేషన్ సెంటర్లు సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దాతల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాల్లో రోగులకు ఆహారం, పoడ్లు, పాలు, ఇతర నిత్యవసర వస్తువులు అందించాలని ఆయన కోరారు.

కరోన ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రెవెన్యూ ఆశించిన మేర రానప్పటికి సహృదయంతో నిదులను ఆసరా  పెన్షన్లు లబ్ది దారులకు విడుదల చేయడానికి కావాల్సిన నిధులను సహృదయంతో మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కు  ఆయన కృతజ్ఞతలు  తెలిపారు.

రాష్ర్ట పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ సెక్రెటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ శ్రీ రఘున౦ధన్ రావు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ‌ఎన్‌సి శ్రీ సంజీవ రావు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post