జనగామ ఏరియా హాస్పిటల్ లో వైద్యులకు పీపి ఇ కిట్ల ను పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స, అందుబాటులో ఉన్న రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలు, వైద్య సదుపాయాల పై డాక్టర్లు, సూపరింటెండెంట్ తో మాట్లాడిన మంత్రి
గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎండీ చెలమశెట్టీ అనిల్ సోజన్యంతో 150 పి పి ఇ కోట్లను అందచేసిన మంత్రి
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
అవసరార్థం వచ్చే పేషంట్ల కు మంచి వైద్యం అందించాలి
కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స లో వైద్యుల సేవలు నిరుపమానమైన వి
వైద్యుల తమ ప్రాణాలను ఫణంగా పెట్టిమరి పని చేస్తున్నారు
వారి సేవలను ప్రపంచం మరచిపోదు. వేనోల్ల కొనియాడుతున్నారు
ప్రజలు వైద్యులకు సహకరించాలి
కరోనా నిర్మూలన జరిగే వరకు సీఎం కెసిఆర్ చెప్పినట్లు పూర్తి లాక్ డౌన్ పాటించాలి
జనగామ వైద్యులకు పి పి ఇ కోట్లను స్పాన్సర్ చేసిన గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎండీ చెలమశెట్టీ అనిల్ కు అభినందనలు
కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న దాతలకు అభినందనలు
కరోనా ను సామాజిక భౌతిక దూరం, స్వీయ నియంత్రణ తో ఎదిరిద్దాం
కలసి కట్టుగా కరోనా ను కట్టడి చేద్దాం
ఈ కార్యక్రమంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, జెడ్పీటీసీ లు, కార్పొరేటర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.