జనగామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, తదితరులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ధాన్యం కొనుగోలు పద్ధతి ని పరిశీలించిన మంత్రి. రైతులు, అధికారులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్న మంత్రి.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
రైతులు పండించిన ఆఖరి గింజ ను కూడా ప్రభుత్వమే కనీస మద్దతు ధర తో కొనుగోలు చేస్తుంది
రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు
కరోనా నేపథ్యంలో రైతులు జాగ్రత్త గా ఉండాలి
తమ కూపన్లు వచ్చిన సమయానికి మాత్రమే కొనుగోలు కేంద్రానికి రావాలి
అధికారులు రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి
సామాజిక భౌతిక దూరం పాటించేలా చూడాలి
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం కట్టుబడి ఉంది
సీఎం కెసిఆర్ అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉన్నారు
వచ్చే సీజన్ కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం అయ్యాయి