Dt.24-06-2021
PRESS NOTE
Hon’ble MP and Chairman, P.V.Narasimha Rao Centenary Celebrations Committee Dr. K.Keshava Rao informed that The Hon’ble Governor Dr.Tamilisai Soundararajan and The Hon’ble Chief Minister Sri K.Chandrashekar Rao will participate in the closing ceremony of Late Sri PV.Narasimha Rao Centenary Celebrations to be held on 28th June,2021 at Necklace Road, Hyderabad.
Hon’ble MP along with Sri Somesh Kumar, IAS, Chief Secretary held a meeting with officials at BRKR Bhavan today and reviewed the arrangements being made in connection with Centenary Celebrations. Officials were directed to make elaborate arrangements in a befitting manner.
Sri Arvind Kumar,IAS, Principal Secretary, MA&UD, Sri Vikas Raj, IAS, Principal Secretary, GAD, Sri Anjani Kumar, IPS, Commissioner of Police, Hyderabad, Sri Arvinder Singh, IAS, Director, Protocol and other officials attended the meeting.
పత్రికా ప్రకటన తేది. 24.06.2021
ఈ నెల 28 వ తేదిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగే భారత మాజి ప్రధాన మంత్రి శ్రీ పి.వి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు హాజరవుతారని, శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు శ్రీ కె. కేశవరావు తెలియజేశారు.
గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ శతజయంతి వేడుకల ఏర్పాట్ల పై సమీక్షించారు. శత జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీకుమార్, ప్రొటోకాల్ డైరెక్టర్ శ్రీ అర్విందర్ సింగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం