Sri K.T.Rama Rao, Hon’ble Minister for MA&UD.

పత్రిక ప్రకటన                                                                                                                                                తేది. 16.05.2021

తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనిచ్చిన ‘గ్రీన్ కో’

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కే.టీ.రామారావు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించినందుకు గ్రీన్ కో సంస్థకు మంత్రి శ్రీ కే.టీ.రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి అన్నారు. అయితే ఇప్పుడు ఎంతో అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Share This Post