రైతుల్లో మనోధైర్యం నింపేందుకే ప్రభుత్వం ధాన్యంను కొనుగోలు చేస్తుంది౼మంత్రి పువ్వాడ

 

రైతుల్లో మనోధైర్యం నింపేందుకే ప్రభుత్వం ధాన్యంను కొనుగోలు చేస్తుంది౼మంత్రి పువ్వాడ

౼ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనే పూచి ప్రభుత్వానిదే

౼ వైరస్ ప్రబలకుండా రైతులు సామాజిక దూరం పాటించాలి

౼ జుల్లూరుపడులో వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 21: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు గ్రామంలో Pacs ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ గారితో కలిసి ప్రారంభించారు.

 

 

ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

ప్రపంచ మానవాళి కరోనా వైరస్ ప్రభావంతో పెను విషాదం ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో రైతుల మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు, రైతులు ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. రైతులు పండించిన పంటలు తక్కువ రేటుకు వ్యాపారులు దళారులు కొనకూడదనే భావంతో ఆపద సమయంలో రైతులను ఆదుకోవాలని సంకల్పంతో సూక్ష్మస్థాయిలో కొనుగోలు ప్రక్రియను ముమ్మరం చేశామన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, కొనుగోలులు దాదాపు పూర్తి అవుతున్నాయని అన్నారు. జిల్లాకు సరిపడు హార్వెస్టర్ లు ఉన్నాయని అన్నారు. జిల్లాకు 161 హార్వెస్టర్లు అవసరం అవగా 182 ఉన్నాయని వారి కోతలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పౌరసరఫరాల శాఖ, ఐకేపీ, పిఎసిఎస్, మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర కు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచీ ప్రభుత్వానిదే అన్నారు. సేద్యానికి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దృశ్య రైతులు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని, మనిషికి మనిషికి మధ్య మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలన్నారు.

జిల్లాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా పుష్కలంగా సాగునీటిని ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. అనంతరం భద్రాద్రి జిల్లాను కరోనా పాజిటివ్ రహిత జిల్లాగా చేసినందుకు జిల్లా కలెక్టర్ MV రెడ్డి IAS గారిని శాలువాతో సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ MV రెడ్డి IAS గారు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు, మార్కుఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ గారు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, RDO, వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post